Ribapappa Lyrics Ribapappa Song Lyrics Ribapappa
Ribapappa Song Lyrics From Baby Movie
Lyrics Of Ribapappa Song From Baby Movie
Baby Songs Lyrics Baby Movie Songs Lyrics
Baby Movie Lyrics Baby Lyrics
---------------------
Lyrics in Telugu Script @ Ribapappa Lyrics - Baby Movie Song
---------------------
Find More Here in the Blog:
Songs Sung by Sri Krishna
Songs Lyrics by Suresh Bansetti
Songs Music by Vijay Bulganin
---------------------
ఎదురుగా ఇంతందంగా.. కనిపిస్తుంటే నీ చిరునవ్వు
ఎదసడే హద్దులు దాటే.. చూడూ చూడూ చూడూ
కుదురుగా ఉందామన్నా.. ఉంచట్లేదే నన్నే నువ్వూ
నిదరకే నిప్పెడతావే.. రోజూ రోజూ రోజూ
నీ చూపుల్లోనా.. బాణం
అందంగ తీసే.. ప్రాణం
నీ మౌనంలోన.. గానం
ప్రాణాలు పోసే.. వైనం
అందుకే ఇంతలా పిచ్చిగ ప్రేమిస్తున్నా
రిబపప్పరిబపప్పపా.. మనస్సంత సమర్పించుకో
రిబపప్పరిబపప్పపా.. వరం ఇచ్చుకో
రిబపప్పరిబపప్పపా.. ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్పరిబపప్పపా.. ఆలకించుకో
నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ.. నీలోనె దాచేసుకొ ఎప్పుడూ
ఆమాట నువ్విస్తె నాకిప్పుడూ.. ఇంకేది అడగన్లె నిన్నెప్పుడూ
నా చేతి రేఖల్లొ.. నీ రూపురేఖల్ని..
ముద్రించుకున్నాను చిలకా
నా నుదుటి రాతల్లొ.. నీ ప్రేమలేఖల్ని..
చదివేసుకున్నాను తెలుసా
చెలియా.. నాపై.. కొంచం మనసుపెట్టూ..
నీ ప్రేమంతా.. నాకే పంచి పెట్టూ..
నా ఊపిరికి నువ్వే.. ఆయువుపట్టూ..
నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ..
కుదరదనకు.. వలపు వెన్నెలా
రిబపప్పరిబపప్పపా.. మనస్సంత సమర్పించుకో
రిబపప్పరిబపప్పపా.. వరం ఇచ్చుకో
రిబపప్పరిబపప్పపా.. ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్పరిబపప్పపా.. ఆలకించుకో
నువుతప్ప నాకేమి.. కనిపించదూ
నువుతప్ప చెవికేది.. వినిపించదూ
నువులేని యే హాయి.. మొదలవ్వదూ
నువు రాని.. నా జన్మ పూర్తవ్వదూ
నీ కలలతో కనులు ఎరుపెక్కిపోతున్న..
చూస్తూనె ఉంటాను తెలుసా
నీ ఊహతో మనసు బరువెక్కిపోతున్న..
మోస్తూనె ఉంటాను మనసా
నిన్నే ఆలోచిస్తూ.. మురిసిపోతా
మురిసీ మురిసీ.. రోజూ అలసిపోతా
అలిసి అలిసి.. ఇట్టే వెలిసిపోతా
వెలిసీ వెలిసీ.. నీలో కలిసిపోతా
తెలుసుకోవె.. కలల దేవతా
రిబపప్పరిబపప్పపా.. మనస్సంత సమర్పించుకో
రిబపప్పరిబపప్పపా.. వరం ఇచ్చుకో
రిబపప్పరిబపప్పపా.. ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్పరిబపప్పపా.. ఆలకించుకో
Lyricist : Suresh Bansetti
Male Singer : Sri Krishna
Director : Sai Rajesh
Actress : Vaishnavi Chaitanya
Music : Vijay Bulganin
Actor : Anand Devarakonda
Movie : Baby
Actor : Viraj Ashwin
Comments
Post a Comment