అల్లిపూల వెన్నెలా పాట సాహిత్యం - తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట

Allipoola Vennela Song Lyrics Allipoola Vennela Lyrics Allipoola Vennela 
Allipoola Vennela Song Lyrics Telangana Jagruthi Bathukamma
Lyrics Of Allipoola Vennela Song Telangana Jagruthi Bathukamma
Telangana Jagruthi Bathukamma Songs Lyrics Telangana Jagruthi Bathukamma Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Mittapalli Surender
Songs Music by A. R. Rahman
---------------------


బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో
బంగారు బతుకమ్మ వియ్యాలో
బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో
బంగారు బతుకమ్మ వియ్యాలో

అల్లిపూల వెన్నెలా.. చెరువులోన కురవగా
పూలకింద్రధనస్సులే.. నేల మీద నిలవగా
కొమ్మలన్ని అమ్మలై.. వేల పూలు విరియగా
పుట్టుమన్ను మట్టిలో.. మట్టి గౌరి పుట్టగా
అల్లిపూల వెన్నెలా.. చెరువులోన కురవగా

తరలివచ్చె తంగెడూ.. తనకు పట్టుచీరగా
రవికలాగ తామరా.. పువ్వులన్ని మారగా

తనువుకేమొ గుమ్మడి.. బంధమయ్యి నిలువునా
పొద్దుపొడుపు దిద్ది నీ నుదుటి మీద కుంకుమా

కూలితల్లి గొంతులో.. కోయిలమ్మ కూయగా
తెలంగాణకొచ్చెనే.. బతుకమ్మ పండుగా

అమ్మగుండె గూటికీ.. ఆడపడుచు ఆటకి
గునుగు పూల తోటకీ.. ఏనుగు మీద తేగకి
యేరువాక యెదలకి.. యేటిలోని అలలకి
కట్ల పూల కళ్ళకి.. కానుకయ్యి పల్లకి
తరలి తరలి వచ్చెనే.. బతుకమ్మ
వరదలపై తరలిపోవు.. తన జన్మ


మెట్టినింటి పిలుపుతో.. వెళ్ళిపోయె చెల్లెలా
జ్ఞాపకాల బరువులో.. చెమ్మగిల్లె తల్లిలా
ఆడబిడ్డ చెయ్యినీ.. పల్లి తల్లి గడపనీ
దాటిపోయె నీటిలో.. ఒదిగిపోయె వేళలో
సాగనంపి చెల్లెలూ.. చెరువు కొమ్మ చివరనా
మరల మరలి రమ్మనీ.. బతుకమ్మని వీడగా

అల్లిపూల వెన్నెలా.. చెరువులోన కురవగా
పూలకింద్రధనస్సులే.. నేల మీద నిలవగా
కొమ్మలన్ని అమ్మలై.. వేల పూలు విరియగా
పుట్టుమన్ను మట్టిలో.. మట్టి గౌరి పుట్టగా
Female Singer : Uthara Unnikrishnan
Female Singer : Haripriya
Female Singer : Rakshita Suresh
Female Singer : Deepthi Suresh
Female Singer : Aparna Harikumar
Female Singer : Padmaja
Music : A. R. Rahman
Director : Gautham Menon
Actress : Mekha Rajan
Actress : Anagha
Actress : Angelina

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music