భీమ్లా నాయక్ పాట సాహిత్యం

Bheemla Nayak Title Song Lyrics Bheemla Nayak Title Lyrics Bheemla Nayak Title 
Bheemla Nayak Title Song Lyrics From Bheemla Nayak Movie
Lyrics Of Bheemla Nayak Title Song From Bheemla Nayak Movie
Bheemla Nayak Songs Lyrics Bheemla Nayak Movie Songs Lyrics
Bheemla Nayak Movie Lyrics Bheemla Nayak Lyrics
---------------------
---------------------
Find More Here in the Blog:
Songs Lyrics by Ramajogayya Sastry
Songs Music by S. Thaman
---------------------


సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ళ మేడాగాదు
గుర్రమునీళ్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోనా
బెమ్మాజెముడు చెట్టున్నాది

బెమ్మజెముడూ చెట్టూకింద
అమ్మా నెప్పులు పడుతున్నాది
ఎండలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులీపిల్ల

పుట్టిండాడు పులీపిల్ల
నల్లామల్ల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సోమలగండు

నాయన పేరు సోమలగండు
తాత పేరు బహుదూరు
ముత్తులతాతా ఈరయనాయక్
పెట్టిన పేరు భీమ్లా నాయక్

సెభాష్ భీమ్లా నాయక


భీమ్లా నాయక్.. భీమ్లా నాయక్

ఇరగదీసె ఈడి ఫైరు.. సల్లగుండ
ఖాకి డ్రెస్సు పక్కనెడితె.. వీడే పెద్దగూండా
నిమ్మలంగ కనపడే.. నిప్పు కొండ
ముట్టుకుంటె తాట లేసిపోద్ది.. తప్పకుండ
ఇస్తిరి నలగని చొక్కా
పొగరుగ తిరిగే తిక్కా
చెమడాలొలిచే లెక్కా
కొట్టాడంటే పక్కా.. విరుగును బొక్కా

భీం భీం భీం భీం.. భీమ్లా నాయక్
బుర్ర రాం కీర్తన పాడించే.. లాఠీ గాయక్
భీం భీం భీం భీం.. భీమ్లా నాయక్
దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్


ఆ జుట్టునట్ట సవరించినాడో..
సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్టునట్టా మడతెట్టినాడో..
రంగాన పులులూ గాండ్రించినట్టె
ఆ కాలి బూటూ బిగ్గట్టినాడో..
తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీమ్లా నాయక్.. భీమ్లా నాయక్

ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తె.. ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలొ వీడే ఒక బ్రాండ్ తెల్సా
వీడి దెబ్బ తిన్న ప్రతి వోడు.. పాస్టు టెన్సా

నడిచె రూటే స్ట్రైటు..
పలికే మాటే రైటు..
టెంపెర్మెంటే హాటు..
పవర్‌కు ఎత్తిన గేటు.. ఆ నేమ ప్లేట్

భీం భీం భీం భీం.. భీమ్లా నాయక్
బుర్ర రాం కీర్తన పాడించే.. లాఠీ గాయక్
భీం భీం భీం భీం.. భీమ్లా నాయక్
దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్


గుంటూరు కారం.. ఆ యూనిఫారం
మంటెత్తిపోద్ది.. నకరలు చేస్తే
లావ దుమారం.. లాఠి విహారం
పేట్రేగిపోద్ది.. నేరాలు చూస్తే
సెలవంటు అనడూ.. శనాదివారం
ఆల్ రౌండ్ ద క్లాకూ.. పిస్తోలు దోస్తే

భీమ్లా నాయక్.. భీమ్లా నాయక్
Lyricist : Ramajogayya Sastry
Movie : Bheemla Nayak
Music : S. Thaman
Director : Sagar K Chandra
Male Singer : Ram Miryala
Male Singer : S. Thaman
Male Singer : Sri Krishna
Male Singer : Prudhvi Chandra
Actor : Pawan Kalyan

Comments

Dear Music Lovers

Please refer affiliate-disclosure .

Enjoy listening music