చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ
నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది.. వెలుగొందుతోందీ
నా గుండె లోగిలీ
నీ ఊసులోనె.. ముసురాడుతోందీ
ఈ నాన్న ఊపిరీ.. కలలు దాటి యేనాటికైనా
చేరాలి.. నీ దరీ
యిన్నళ్ళు.. ఉన్నానంటే.. ఉన్నానంటూ
యేకాకి.. మాదిరీ
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ
నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది.. వెలుగొందుతోందీ
నా గుండె లోగిలీ
కను చివరన జారే.. తడి చినుకును సైతం
సిరితలుకుగ.. మార్చే చిత్రం.. నీవే
కలతగ.. పొల మారే.. యెద మంటల గ్రీష్మం
సులువుగు.. మరిపించె.. మంత్రం నీదే
నువ్వంటె.. నా సొంతమంటూ.. పలికింది మమకారం
ఆ మాట.. కాదంటు.. దూరం.. నిలిపింది.. అహంకారం
తలవాల్చి నువ్వలా.. వొడిలోన వాలగా
నిండు నూరేళ్ళ.. లోటు..
తీరిపోదా.. అదే క్షణానా
చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ
నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది.. వెలుగొందుతోందీ
నా గుండె లోగిలీ
నిదురించు వేళ.. నీ నుదుట నేను..
ముత్యాల అంజలీ
జోలాలి పాడి.. తెరిచాను చూడు..
స్వప్నాల వాకిలీ
యే బూచి.. నీడ.. నీపై
రానీయకుండా.. నేనేగ కావలీ
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
ఆరారిరారో.. రారో రారో.. ఆరారిరారో
చిన్నారి తల్లీ.. చిన్నారి తల్లీ
Comments
Post a Comment