మన్మథుడా నీ కల కన్నా.. మన్మథుడా నీ కథ విన్నా
మన్మథుడంటె కౌగిలిగా.. మన్మథుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే.. ఎపుడో తెలియకా
నిన్ను కన్న తొలినాడే.. దేహం కదలకా
ఊహలలో అనురాగం.. ఊపిరి వలపేలే
ఎందరినో.. నే చూసాగానీ.. ఒకడే మన్మథుడూ
ఇరవై ఏళ్ళుగ ఎపుడూ ఎరుగని.. ఇతడే నా ప్రియుడూ
ఎందరినో.. నే చూసాగానీ.. ఒకడే మన్మథుడూ
ఇరవై ఏళ్ళుగ ఎపుడూ ఎరుగని.. ఇతడే నా ప్రియుడూ
మన్మథుడా నీ కల కన్నా.. మన్మథుడా నీ కథ విన్నా
మన్మథుడంటె కౌగిలిగా.. మన్మథుడే నా కావలిగా
మగువగా.. పుట్టినా.. జన్మఫలితమీనాడు తెలిసే
మత్తుగా.. మెత్తగా.. మనసు గెలిచె.. నా తోడు కలిసీ
యదలలోన ఊయలలుగే.. అందగాడు ఇతడంటా
యదకు లోతు ఎంతో చూసే.. వన్నెకాడు ఎవరంటా
అయినా నేను మారాలే.. అందంగా బదులిస్తాలే
సుఖమై యద విరబూస్తున్నా.. పులకింతే తెలిసిందా
ఒక్క చూపుకు తనివే తీరదు.. అది యేం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు.. ప్రియుడే అయితే.. ఇది యేం చరిత్రమో
ఒక్క చూపుకు తనివే తీరదు.. అది యేం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు.. ప్రియుడే అయితే.. ఇది యేం చరిత్రమో
మన్మథుడే నా ప్రాయముగా.. మన్మథుడే నా ప్రాణముగా
మన్మథుడే నా ప్రణయమనీ.. మన్మథుడే నాకిష్టమనీ
చుక్కపొద్దుల్లొ దాహం.. పెంచు.. ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం.. సిగ్గులే మరువనా
నా పదకటింటికీ.. నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే.. నన్నే ఏలు దొరా
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
అందం నీకే రాసిస్తాలే.. నన్నే ఏలు దొరా
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
Comments
Post a Comment