నువ్వు కోరుకున్నది సాధించుకోవడానికి ఏ శక్తి ఆపుతోంది నిన్ను?
అలిసిపోయావా? కళ్ళు మూతలు పడుతున్నాయా? బలం లేదా, సమయం లేదా? ఇవేనా నీకు అడ్డుపడుతోంది?
డబ్బు లేదా?
లేదా, ఈ కారణాలు చెప్పుకొని, నీకు నువ్వే అడ్డుపడుతున్నవా?
ఇలాంటివన్ని చెప్పేవాడికి, కారణాలు ఎప్పుడూ అందంగా ఉంటాయి.
నీ పరిస్థితిని చూసుకొని జాలిపడకు. అందులోనుంచి బయటికిరా. నీ ఏడుపు కథలు విని, అందరు నీకు జాలి చూపించాలి అని అనుకోవడం తప్పు, దాన్ని ఆపు.
నీ ఫ్రెండో, శత్రువో, పెద్దపెద్ద కార్లలో, పెద్దపెద్ద బంగ్లాల్లో, జీవితాన్ని పెద్దగా అనుభవిస్తుంటే, చూసి ఈర్ష పడుకు. ఎందుకంటే, వాళ్ళందరు శరీరకంగా కష్టపడి, మానసికంగా వేదన పడి, చెమట చిందించి, సాధించుకున్నారు. ఎవరికి ఏది ఉచితంగా రాదు బాస్.
నువు కూర్చున్న స్థానం నుంచి కదులు, నీలోని పట్టుదలని బయటికి తీయి. నీ ఆటని మొదలుపెట్టు. నీ శక్తిని, యుక్తిని ఉపయోగించే సమయం వచ్చేసింది.
నీ జీవితం నీకు నచ్చటంలేదా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా? మరి అయితే ఏదో ఒకటి చేయి. ఊరికే బాధపడుతూ కూర్చుంటే, వాటంతటకు అవి మారిపోవు భయ్యా. నీకు ఏదైనా కావాలి అనిపిస్తే, నువ్వు పోయి తెచ్చుకోవాల్సిందే, చేతికి ఎవరు తెచ్చి ఇవ్వరు ఇక్కడ.
నువ్వు చెప్పుకొనే కారణాలు అన్నీ కూడా కల్పితాలు, మాయలు, అబద్ధాలు. వాటిని ఎలా ఆపుతావు? వాటిని ఆపగలిగే శక్తి ఒక్క నిజానికి మాత్రమే ఉంది.
ఆ నిజం ఏంటో తెలుసా?
నువు కోరుకున్నది సాధించుకోవడానికి, నీ దగ్గర సమయం ఉంది, నైపుణ్యం ఉంది, జ్ఞానం ఉంది, సంకల్ప శక్తి ఉంది, క్రమశిక్షణ ఉంది. నువ్వు చేయి చాచి అడిగితే సాయం కూడా దొరుకుతుంది.
సవాళ్ళు లేని జీవితాన్ని మనము ఆస్వాదించలేము. విలువైనవి అన్ని ఎప్పుడూ ఎత్తులోనే ఉంటాయి, మనము అక్కడికి పోవాల్సిందే, అవి మనచెంతకి రావు. ఆ దారి కూడా సులభంగా ఉండదు, ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. కాని నీ జీవితం బాగుంటుంది, నువు ఆనందంగా ఉంటావు.
ఏదైనా కోరుకుంటున్నావా? నీకు నువ్వు సాధించుకోవాల్సిందే. ఈ క్షణం నీది, సమయం నీది, అవకాశం నీది.
రేపు అనేది లేదు, ఉన్నదల్లా ఈ క్షణం మాత్రమే. ఇది నీ కల. అడుగు ముందుకు వేయి, నీ చరిత్ర రాయి.
Comments
Post a Comment